skip to main |
skip to sidebar
అయితే పద
'నాన్నా... సర్కస్‌కు వెళ్దాం' అడిగాడు దీపు.
'ఏముంటుందిరా అందులో' పెదవివిరిచాడు తండ్రి.
'ఏనుగులున్నాయట నాన్నా'
'ఏనుగుల్నేం చూస్తాంరా'
'ఏనుగులు ఫుట్‌బాల్ ఆడతాయట'
'అందులో చూడ్డానికేముందిరా'
'షార్ట్స్ వేసుకున్న అమ్మాయిలు ఆ ఏనుగులను ఆడిస్తారట'
'సర్లే వెళ్దాం పద, ఏనుగులను చూడక చాలా ఏళ్లయింది'.
No comments:
Post a Comment