ఆ రోజు సుధాకర్ భార్యకు డెలివరీ డేటు. కొడుకే పుడతాడని గట్టి నమ్మకంతో ఉన్నాడు సుధాకర్. ఆఫీసులో ఉన్నాడే కానీ ఎప్పుడెప్పుడు తీపి కబురు వింటానా అని తొందరపడుతున్నాడు. అయినా వీలైనంత స్థిమితంగా ఉన్నాడు.
సహచరులకు ఈ శుభవార్త తెలిస్తే పార్టీ ఇమ్మంటారని భయం. అందుకే బావమరిదికి ముందే ఓ కోడ్ చెప్పి ఉంచాడు. తను 'గడియారం వచ్చిందా?' అని అడుగుతాడు. పిల్లవాడు పుడితే 'వచ్చింది' అనాలి.
అప్పటికి సుధాకర్ రెండు మూడు సార్లు ఫోన్ చేయడమూ ఇంకా రాలేదని జవాబు చెప్పడం జరిగిపోయింది.
మరో అరగంట పోయాక ఫోన్ చేసి, 'గడియారం వచ్చిందా?' మళ్లీ అడిగాడు సుధాకర్.
అక్కడ బావమరిది సందేహంలో పడ్డాడు. పుట్టింది బాబు కాదు పాప. రాలేదంటే ఇంకా ప్రసవం కాలేదనుకుంటాడు. అందుకని ఇలా జవాబిచ్చాడు. 'గడియారం వచ్చింది, కానీ ముల్లు లేదు.'
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బాగుంది.
Super ga vundi
Post a Comment